Gaaradi Telugu news logo

భోగి మూవీ ఓ బిగ్ డిజాస్టర్ గా డిక్లేర్ అయినట్టే. అంటే కేవలం ఒక్క రోజులోనే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు అనిపించొచ్చు. బట్ ఇంత వీకెస్ట్ రైటింగ్ ఉన్న మూవీకి ఈ మాట రావడం కామనే. శర్వానంద్, సంపత్ నందిల భోగి ఎమోషనల్ గా ఎవరికీ కనెక్ట్ కాకపోవడానికి కారణం రైటింగే. తలా తోక లేని కథనంతో దర్శకుడు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు విసిగించాడు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో మైనస్ లేంటీ అంటే.. అసలు సినిమానే మైనస్ అంటే కూడా తప్పు లేదు. అంత బలహీనమైన రైటింగ్ ఇది. మరి ఈ మూవీలో ఉన్న లోపాలేంటీ అంటే అన్నీ కాదు కానీ కనీసం ప్రధానమైన మైనస్ లు మాత్రం ఇవే.
ఫస్ట్ సీన్ లోనే అదేదో చెరువు కట్ట తెగింది అన్నారు. ఆ కట్ట తెగిందని చూపించలేదు ప్రాపర్ గా. ఆపై ఊరివాళ్లంతా దొరగారి ఇంటికి వెళతారు. కాపాడమని అడుగుతారు. అంతే. తర్వాత ఏమైందో చెప్పరు.
ఇక శర్వానంద్ కు ఐదుగురు చెల్లెల్లు ఉంటారు. వారితో ఇతనికి ఉన్న అనుబంధం ఎంత గొప్పది అని చెప్పడానికి ఒక్క బలమైన సన్నివేశం కూడా లేదు. ఇంకా చెబితే ఆ అమ్మాయిలే మా అన్న తోపు అని ఫీలవుతారు అంతే. ఇంకా చెబితే చెల్లెల్ల కోసం అన్న కష్టపడ్డాడు అని కాకుండా అన్న కోసమే చెల్లెల్లు కూలి పనిచేసినట్టుగా చూపించలేదు. అదే టైమ్ లో వారి తల్లి తండ్రులు ఏమయ్యారు అని ఒక్క డైలాగ్ కూడా లేదు. ఆ కారణంగా ఈ సిస్టర్ సెంటిమెంట్ ఎవ్వరికీ కనెక్ట్ కాలేదు. చివరికి వాళ్లను కొందరు హత్య చేసినా ఆడియన్స్ లో ఎలాంటి ఫీలింగ్ రాదు.
ఇక అనుపమ పరమేశ్వరన్ తల్లి తండ్రులు అనేది కూడా చూపించలేదు. ఆమెకు ఓ బామ్మ ఉంటుంది. మరి పేరెంట్స్ ఎందుకు లేరు అనేది చెప్పలేదు. తను కూడా కూలి పని చేస్తుంటుంది.
ఇక ఆ ఊరిలో కొందరు కుర్రాళ్లు ప్రతి అమావాస్య రోజు మాయం అవుతుంటారు. మళ్లీ తిరిగి వస్తారు. మరి ఆ రోజు వాళ్లేం చేస్తారు అనేది ముందుగానే చెప్పడంతో శర్వానంద్ చెల్లల్లను చంపుతారు అని ముందే ఊహించేస్తారు. అందుకే ఈ సీన్ కనెక్ట్ కాలేదు.
శర్వానంద్ వాళ్ల ఒదిన ఎందుకు అంత కోపంగా ఉంటుంది అనేది ఒక్క సీన్ కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. నిజానికి ఆ కాలం.. ఇంకా చెబితే ఈ కాలంలో కూడా తెలంగాణలో అన్నదమ్ముల మధ్య, ఒదిన మరుదుల మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. మరి ఆ కాలంలో ఆమె ఎందుకు అంత ఆవేశపడుతుంది అనేది దర్శకుడికే తెలియాలి.
ఇక ఇంటర్వెల్ లో జరిగిన ఫైట్ లో అతని స్నేహితులే అతన్ని చంపాలని చూస్తారు. అని చనిపోయాడనే వెళ్లిపోతారు. ఇది కూడా అంతా ఊహించేదే. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నారు దీన్ని. మరి ఇంటర్వెల్ తర్వాత అంటే.. అనేక కత్తి పోట్లకు గురైన హీరో మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు. దానికి ఓ వర్షం కురిసిన రాత్రి ఆ వర్షం వల్ల.. అతని చెల్లె చీర కొట్టుకుని వెళ్లి అతను ఉన్న ప్లేస్ వరకు వెళుతుంది. అతి తగిలి హీరోకు మెలకువ వస్తుంది. లేసి.. అన్ని కత్తి పోట్లకు గురైనా.. ఓ చిన్న ఆకు పసరు కట్టుకుని మళ్లీ సెట్ అయిపోతాడు. అలాగే అక్కడ తన చెల్లెల్లు చనిపోయారని తెలుసు కదా. ఊరి వాళ్లందరినీ పిలవకుండా తనే వారిని బొందలు తవ్వుతాడు. కనీసం ఆ బొందలు తవ్వే సీన్ కూడా కామెడీగా ఉంది. అక్కడ ఐదుగురిని పూడ్చేస్తాడు. కానీ ఊరిలోకి వెళ్లకుండా.. అంత వర్షం కురిసిన మరుసటి రోజు మట్టిలోనే సెట్ చేసి ఓ పేద్ద కత్తి తయారు చేస్తాడు.
ఇక ఆ కత్తితో అందరినీ అంతం చేస్తాడు. ముఖ్యంగా దొరను నరుకుతాడు. తన చెల్లెల్ల చావుకు కారణమైన తన ఊరి వారైనా ఫ్రెండ్స్ ను నరుకుతాడు అనుకుంటాం. అదీ ఇమ్మీడియొట్ గా చేయడు. ఇక చివరికి ఆ ఫ్రెండ్స్ ను నరికే టైమ్ దొరుకుతుంది. అక్కడ కూడా తనే ఎక్కువగా తన్నులు తింటాడు. మరి తర్వాతైనా తను తయారు చేసిన కత్తితో నరుకుతాడా లేదు. అదేదో ఒక ఓ జంతు కళేబరంలోని ఎముకను తీసుకుని వారిని ఏసేస్తాడు. ఆ ప్రయత్నంలో వారిలో ఒకడు నీ చెల్లెల్లలో ఒకరు బతికే ఉన్నారు అని చెబుతాడు. మరి తను ఆల్రెడీ ఐదుగురుని పూడ్చాడు కదా. మరి ఈ పాయింట్ ఎలా రైజ్ అయింది అనేది తెలియనే తెలియదు.
దీనికంటే డింపుల్ హయాతి ఎపిసోడ్. ఇందులో డింపుల్ ఓ ఉంపుడుగత్తె అని లేదంటే జోగినిలాగానే చూపించారు. జోగిని అంటే ఒక ఊరికే పరిమితం అవుతుంది. ఉంపుడుగత్తె అంటే ఒకడి చేతిలో ఉంటుంది. మరి అదేంటో ఆవిడ అదే పనిగా ఎడ్ల బండ్లలో ఊరూరు తిరుగుతూ.. తను ఎవరితోనో పడుకున్నాను.. బలవంతంగా అని ఆ మండి నడిపేవాడితో అంటుంది. బట్ క్లియర్ గా చూస్తే తను ఓ ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్ లాగా కనిపించింది తప్ప.. బలవంతంగా ఈ రొంపిలోకి దింపిన మనిషిలా అనిపించదు. ఇక ఆవిడ ఓ పోలీసోడుతో ఉన్న ఎపిసోడ్ మాత్రం అబ్బో.. అనిపిస్తుంది.
ఇక చివర్లో ఓ బాపనాయన మొత్తం ఈ కుట్ర వెనక ఉన్నాడు అని ట్విస్ట్ ఇచ్చారు అని భావించారు. అంటే అప్పటి వరకు 107మంది కన్యలను బలి ఇచ్చింది దొర కాదు. ఓ బాపనాయన అని చెప్పడం.. దాని వెనక ఉన్న పాయింట్ చూస్తే అసహ్యం వేస్తుంది అంటే కూడా తప్పేం లేదు. ఇంకా చెబితే దొర తప్పేం లేదు అని చెప్పడం అన్నట్టుగానే ఉంది. ఇక చివర్లో మళ్లీ తన బతికిన చెల్లెను తీసుకువచ్చి మళ్లీ నరబలి చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ టైమ్ లో అక్కడే ఉన్న శర్వానంద్ చాలాసేపు కనిపించడు. మరి అందర్లా భయపడ్డాడు అనుకోవచ్చేమో. ఇక క్లైమాక్స్ అసలా మాటకొస్తే అన్ని ఫైట్లతో అసహ్యకరమైన రక్తం చిందించేలా చేయడం తప్ప ఆ ఫైట్లో ఓ గొప్పదనం కనిపించదు. అదీ మేటర్.
ఇలా చెప్పుకుంటే ప్రతి సన్నివేశంలోనూ ఓ చిన్న లాజిక్ కూడా కనిపించదు. ఎవరికీ కనెక్ట్ కాని కంటెంట్ ఇది. ఇంత వరస్ట్ రైటింగ్ ఈ పదేళ్లలో రాలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఉన్నంతలో కాస్త బెటర్ అనిపించింది అనుపమ పరమేశ్వరన్ మాత్రమే. మరి ఇదంతా మీకెందుకు అని ఎవరైనా భావిస్తే ఒక్కటే. సినిమాలను ఇష్టపడేవాళ్లందరికీ ఇలాంటి మూవీస్ చూసి వారికి సినిమాలపైనే అసహ్యం వేస్తుంది. ఇక సినిమాలు చూడకూడదు అని నిర్ణయించుకుంటే ఇబ్బంది తప్పదు. అందుకే ఇలాంటి మీనింగ్ లెస్, సెన్స్ లెస్, మినిమం కామన్ సెన్స్ కూడా లేని వీకెస్ట్ రైటింగ్ ఉన్న మూవీస్ ఇకపై రాకూడదని అనుకోవాలనే ఇదంతా రాసింది. అంతే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి