కార్తికేయ ఏమయ్యాడు..?
కార్తికేయ.. ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. అంతకు ముందే ఒక సినిమా విడుదలైనా.. తన ఫస్ట్ మూవీని ఆర్ఎక్స్ 100 అనే చెప్పుకున్నాడు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావడంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపు కొత్త ఆఫర్స్ తెచ్చింది. ఈ క్రమంలో వరుసగా సినిమాలు చేశాడు. బట్ హిట్ కొట్టడంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాడు. 2023లో బెదురు లంక మూవీతో కమర్షియల్ గా మంచి విజయం అందుకున్నాడు. 2024లో భజే వాయు వేగం అనే మూవీతో బాగా ఆకట్టుకున్నాడు. ఓ ఇంటెన్స్ మూవీగా భజే వాయు వేగం పేరు తెచ్చుకుంది. బట్ కమర్షియల్ గా మాత్రం ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు.
కార్తికేయ గురించి చాలా వార్తలు వచ్చాయి..
కార్తికేయ భజే వాయు వేగం మూవీ తర్వాత సైలెంట్ అయిపోయాడు. అసలేమయ్యాడు అని చాలామంది ఆరాలు తీశారు. ఇంకొందరైతే అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇంక చాలామంది లైట్ తీసుకున్నారు. ఏదైతేనేం అతనికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తూ ఈ సారి తనే దర్శకుడుగా మారాడు. అదీ తన సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ వార్త తెలిసిన చాలామంది ఆశ్చర్యపోయారు. కార్తికేయ అప్పుడే దర్శకత్వం చేయడం వెనక కారణాలేంటీ అంటే అతనికి సరైన హిట్ పడటం లేదు అనేదే అతని భావన అనుకున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు కార్తికేయ.
కార్తికేయ దర్శకుడుగా కూడా మారాడు.. కమ్ బ్యాక్ అంటున్నాడు
కార్తికేయ అనౌన్స్ చేసిన వీడియోలో చూస్తే ముందుగా ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తోంది.‘బాక్సింగ్ వరల్డ్ లో తన పేరు వినిపించి మూడేళ్లవుతోంది. ఇంక ప్రొఫెషన్ మారిపోయి ఉంటాడనుకున్నా.. మూడేళ్లవుతుందని నాకు గుర్తున్నట్టుంది.. నాకు అది కూడా గుర్తు లేదు. అయినా ఇప్పుడొచ్చి ఏం చేస్తాడు.. యా దట్స్ ట్రూ.. ఇట్ ఫీల్స్ లైక్ ఏ సూసైడ్ మిషన్.. త్రి ఇయర్స్ నుంచి ఏమైపోయాడు తెలియలేదు. అసలు ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు..’ అనేదే ఈ వాయిస్ ఓవర్. ఆ వాయిస్ లో చివరగా వినిపించిన మాటకు రీజన్ చెప్పేలా అతను ఏకంగా బాక్సింగ్ ను అదే పనిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదీ ఓ రేంజ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే దీంతో పాటు ‘కమ్ బ్యాక్’ అనే టైటిల్ ను కూడా రివీల్ చేశాడు.
కార్తికేయ కమ్ బ్యాక్ ఇస్తాడా..?
కమ్ బ్యాక్ అనే మాటను చాలా సార్లు సాధారణంగా వాడుతుంటాం. బట్ ఈ పదాన్ని టైటిల్ గానే ఫిక్స్ చేసి మరీ వదులుతున్నాడు. మరి ఇందులో ఇతర కాస్టింగ్ ఎవరు.. ఇంకా చెప్పలేదు కానీ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది.
