సమంత ఈ మధ్య వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతోంది. చేసిన సినిమాలన్నీ పోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అన్నీ పోతున్నాయి. అయినా మరోసారి అదే ప్రయత్నం చేసింది అని మా ఇంటి బంగారంతో అర్థమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. తను చాలా హార్డ్ వర్క్ చేసింది అని తెలుస్తోంది. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మా ఇంటి బంగారంను తన సొంత బ్యానర్ లోనే నిర్మించింది. అందుకే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. ఏకంగా ఒకే రోజు 40ఇంటర్వ్యూస్ ఇచ్చింది అంటే ఇదో రికార్డ్ అని కూడా చెప్పాలి. అంతలా ఈ మూవీ కోసం కష్టపడుతోంది.
ఇక ఈ చిత్రంలో ఓ ఉమ్మడి కుటుంబానికి కోడలుగా వస్తోంది. ఆమెకు కుటుంబ వ్యవహారాలేం తెలియదు. అయినా కష్టపడి అన్నీ నేర్చుకుంటూ అందరికీ నచ్చేలా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. అదే సమయంలో తన కుటుంబం కష్టాల్లో ఉంది తెలుసుకుని ఆ కష్టాలను తొలగించేందుకు తను తీసుకున్న నిర్ణయాలు కీలకంగా ఉంటాయి అని తెలుస్తోంది. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. ముఖ్యంగా తను చీర కట్టుతో చేసిన ఫైట్స్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలవబోతున్నాయనిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. అందుకోసం తన ఫిజిక్ ను కూడా చాలా కష్టపెట్టిందనిపిస్తోంది. మరి ఇంత కష్టానికి తగ్గ ఫలితంగా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది ఈ నెల 19న తేలిపోతుంది.






