తమిళ్ లో రూపొందిన బ్లాస్ట్(Blast Movie) మూవీతో ఓవర్ నైట్ తెగ గుర్తింపు వచ్చింది ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కు. అంతకు ముందు చాలా సినిమాలు చేసినా బ్లాస్ట్ తో వచ్చిన ఫేమ్ మాత్రం చాలా ప్రత్యేకమైనదే అని చెప్పాలి. పైగా ఇది ఓ యాక్షన్ ఓరియంటెడ్ కథ.. అందులో తనూ ఓ ప్రధాన పాత్రగా చేసింది. అందుకే ఈ మూవీతో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అలాంటి ప్రీతి ముకుందన్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బట్ అది తను మిస్ చేసుకుందట.
దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా'(RAAKA Movie) లో కీలకమైన ఓ పాత్ర కోసం మొదట యువ నటి ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే, అప్పటికే ప్రీతి ముకుందన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ముందుగా ఇచ్చిన డేట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన అవలేకపోయినట్టు తెలిపాడు. షెడ్యూల్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అట్లీ.
దీంతో ఆ కీలక పాత్రను చివరకు మలయాళ నటి ఫెమినా జార్జ్(Femina George) దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇలాంటి భారీ సినిమాల్లో అవకాశం రావడం ఏ నటికైనా ప్రత్యేకమే. అయితే డేట్స్ సమస్య కారణంగా ప్రీతి ముకుందన్ ఈ అవకాశాన్ని కోల్పోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. మరోవైపు ఫెమినా జార్జ్‌కు మాత్రం ఇది కెరీర్‌లో మంచి అవకాశం అని భావిస్తున్నారు.






