దళపతి విజయ్(Thalapathi Vijay) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జననాయకన్’ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మూవీ టీమ్ సీబీఎఫ్‌సీ (CBFC) సూచించిన మార్పులను పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను వెరిఫికేషన్ కోసం సమర్పించింది.
ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారికంగా సర్టిఫికేట్ మాత్రం మరో ఒకటి లేదా రెండు రోజుల్లో జారీ కానుందని సమాచారం. దీంతో సినిమా జూలై 23 విడుదల దాదాపు ఖరారైనట్లే బలంగా వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయినప్పటికీ, దాని ప్రభావం ఓపెనింగ్స్‌పై పెద్దగా ఉండదనే అంచనాలు ఉన్నాయి. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘జననాయకన్’ విజయ్(C,M.Vijay) నటుడిగా చేస్తున్న చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అభిమాన సంఘాలు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ పూర్తికావడంతో విడుదలపై ఉన్న సందేహాలకు కూడా తెరపడినట్లైంది. ఇక అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే ఫ్యాన్స్ కు మంచి పండగ రాబోతోందనుకోవచ్చు.






