తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ విడాకుల వ్యవహారం ఎటూ తేలకుండా ఆగిపోయింది. విజయ్ భార్య సంగీత సొర్ణలింగం ఈ యేడాది ఆరంభంలోనే విజయ్ తో విడాకులు కావాలని కేస్ వేసింది. ఈ కేస్ లో తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది సంగీత. విజయ్ కి వివాహేతర సంబంధం, తనపై మానసిక వేధింపులు, ఎమోషనల్ నెగ్లీజెన్స్ ఆరోపిస్తూ సంగీత విడాకుల కోసం దాఖలు చేసింది. ఆ కేస్ ఏప్రిల్ 20న హియరింగ్ కు వచ్చింది. ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా, ఎన్నికల కారణంగా చాలా బిజీగా ఉండిపోయాడు. దీంతో 20న హాజరు కాలేను అని లాయర్స్ ద్వారా అభ్యర్థించాడు. దీనికి మన్నించిన కోర్ట్ జూన్ 15న హియరింగ్ అని చెప్పింది. ఇవాళ జూన్ 15న. బట్ ఆ ఇద్దరూ కోర్ట్ కు హాజరు కాలేదు.
కోర్టు విచారణ సందర్భంగా, అధికారిక అనుమతి పత్రం (వకాలత్‌నామా) దాఖలు చేయకపోవడం, ఇరు పక్షాల వారు స్వయంగా హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఇప్పుడు ఆగస్టు 7కి నిర్ణయించబడింది.
విచారణకు ఇద్దరూ హాజరు కాలేదు అంటే ముందు నుంచీ వస్తోన్న వార్తలకు మరింత బలం చేరింది. ఈ ఇద్దరూ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అని కొందరు.. లేదూ విజయ్ తల్లితండ్రి శోభ, చంద్రశేఖర్ చేసిన రాయబారం వల్ల ఈ ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారు అని మరికొందరు అంటున్నారు. మాగ్జిమం ఇద్దరూ మళ్లీ కలిసిపోవడం ఖాయం అనేది మెజారిటీ జనాల అభిప్రాయం. ఏదేమైనా ఇద్దరి మధ్య సంధి కుదిరినట్టుగానే చాలామంది భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఆగస్ట్ 7న అసలు విషయం తేలిపోతుందేమో చూడాలి.