టాలీవుడ్‌లో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే టాప్ ప్లేస్ కు వెళతారు.అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయంతో ఆమె పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లెనిన్’లో భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. కథకు అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో పాటు, సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మూవీ సక్సెస్ మీట్ లో తను చాలా చాలా ఎమోషన్ అయింది. తన ఫ్యాన్స్ వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పింది.
సినిమా హిట్ అయితే హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా అవకాశాలు పెరగడం సహజం. ‘లెనిన్’కు వచ్చిన మంచి రిజల్ట్ వల్ల భాగ్యశ్రీ బోర్సే పేరు దర్శకులు, నిర్మాతల దృష్టిలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఆమెకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక్క సినిమా హిట్‌తోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం అంత సులభం కాదు. వరుసగా మంచి కథలు ఎంచుకోవడం, నటనలో వైవిధ్యం చూపించడం, ప్రేక్షకులను కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయడం చాలా ముఖ్యం. అదే చేస్తే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో లాంగ్ టైమ్ నిలిచే హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సినిమా కీలకంగా మారుతుంది. ‘లెనిన్’ విజయం భాగ్యశ్రీ బోర్సేకు ఒక పెద్ద ప్లస్ అయినా, ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఈ సినిమా ఆమె మార్కెట్ విలువను, గుర్తింపును మాత్రం ఖచ్చితంగా పెంచిందని చెప్పవచ్చు.’లెనిన్’ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ విజయాన్ని సరైన కథల ఎంపికతో కొనసాగిస్తే, టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.