‘జననాయకన్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

దళపతి విజయ్(Thalapathi Vijay) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జననాయకన్’ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మూవీ టీమ్ సీబీఎఫ్‌సీ (CBFC) సూచించిన మార్పులను పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను వెరిఫికేషన్ కోసం సమర్పించింది.
ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారికంగా సర్టిఫికేట్ మాత్రం మరో ఒకటి లేదా రెండు రోజుల్లో జారీ కానుందని సమాచారం. దీంతో సినిమా జూలై 23 విడుదల దాదాపు ఖరారైనట్లే బలంగా వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయినప్పటికీ, దాని ప్రభావం ఓపెనింగ్స్‌పై పెద్దగా ఉండదనే అంచనాలు ఉన్నాయి. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘జననాయకన్’ విజయ్(C,M.Vijay) నటుడిగా చేస్తున్న చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అభిమాన సంఘాలు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ పూర్తికావడంతో విడుదలపై ఉన్న సందేహాలకు కూడా తెరపడినట్లైంది. ఇక అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే ఫ్యాన్స్ కు మంచి పండగ రాబోతోందనుకోవచ్చు.

Continue reading
అల్లు అర్జున్ ను మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

తమిళ్ లో రూపొందిన బ్లాస్ట్(Blast Movie) మూవీతో ఓవర్ నైట్ తెగ గుర్తింపు వచ్చింది ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కు. అంతకు ముందు చాలా సినిమాలు చేసినా బ్లాస్ట్ తో వచ్చిన ఫేమ్ మాత్రం చాలా ప్రత్యేకమైనదే అని చెప్పాలి. పైగా ఇది ఓ యాక్షన్ ఓరియంటెడ్ కథ.. అందులో తనూ ఓ ప్రధాన పాత్రగా చేసింది. అందుకే ఈ మూవీతో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అలాంటి ప్రీతి ముకుందన్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బట్ అది తను మిస్ చేసుకుందట.
దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా'(RAAKA Movie) లో కీలకమైన ఓ పాత్ర కోసం మొదట యువ నటి ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే, అప్పటికే ప్రీతి ముకుందన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ముందుగా ఇచ్చిన డేట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన అవలేకపోయినట్టు తెలిపాడు. షెడ్యూల్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అట్లీ.
దీంతో ఆ కీలక పాత్రను చివరకు మలయాళ నటి ఫెమినా జార్జ్(Femina George) దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇలాంటి భారీ సినిమాల్లో అవకాశం రావడం ఏ నటికైనా ప్రత్యేకమే. అయితే డేట్స్ సమస్య కారణంగా ప్రీతి ముకుందన్ ఈ అవకాశాన్ని కోల్పోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. మరోవైపు ఫెమినా జార్జ్‌కు మాత్రం ఇది కెరీర్‌లో మంచి అవకాశం అని భావిస్తున్నారు.

Continue reading
అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగుపెట్టిన వెంకటేష్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్, NKRAR2) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో వెంకటేష్ నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటూ కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కావడంతో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కథ, పాత్రలు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యే కొద్దీ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

Continue reading
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading
అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, రాజకీయ అంశాలను కలిపి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని సింబాలిక్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రేక్షకులు కథలో పురాణాల ప్రభావం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం అఖిల్ మేకోవర్. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయికల్లో ఆమె ఒకరు. ‘లెనిన్’లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. సరదాగా ఉండే, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని స్వయంగా భాగ్యశ్రీ తెలిపింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీకి ఈ సినిమా కూడా విజయం అందించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే అది పూర్తిగా కథ, ఆమె పాత్ర నిడివి, ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మాత్రం అఖిల్-భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది ఇద్దరి ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. విడుదలకు ముందు సినిమాకు అదనపు హైప్ రావడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ప్రమోషన్స్ ను బట్టి చూస్తే ‘లెనిన్’లో యాక్షన్, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే సినిమా నిజంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ మాత్రం అఖిల్‌కు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకమైన సినిమా. కథ ప్రేక్షకులను మెప్పిస్తే ఇద్దరికీ ఇది పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading
రావు బహదూర్ మూవీ రివ్యూ

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా మొదటి పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పీరియడ్ డ్రామాకు ఫాంటసీ టచ్ జోడిస్తూ, విజువల్‌గా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం కథ, నటన, టెక్నికల్ విలువలతో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా వెళ్లి, ఒక డిఫరెంట్ సినిమాను అందించాలనే టీమ్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

కథ

ఒక రాజసం ఉన్న వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, అతని వ్యక్తిత్వం వెనుక ఉన్న నిజాలు, అధికారం, అహంకారం, మానవ సంబంధాలు, సమాజం మధ్య జరిగే సంఘర్షణలే ఈ కథకు ప్రధాన బలం. దర్శకుడు కథను నెమ్మదిగా విప్పుతూ ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కథలో ఉన్న మిస్టరీ, భావోద్వేగాలు చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి.

నటీనటుల పనితీరు

సత్యదేవ్ మరోసారి తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. రావు బహదూర్ పాత్రలో అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కళ్లతో చూపించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆచారి పాత్రలో వికాస్ అత్యద్భుతంగా నటించాడు. అతని ఏజ్ కు చాలా ఎక్కువగా చూపించిన పాత్ర అయినా ఆ పాత్రలో తను లీనమైన విధానం మాత్రం సింప్లీ సూపర్బ్. అలాగే దీపా థామస్ కూడా బాగా చేసింది.సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. ప్రతి పాత్ర కథలో భాగంగా అనిపిస్తుంది.

దర్శకత్వం

వెంకటేష్ మహా మరోసారి తన ప్రత్యేకమైన కథనం చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది. అయితే దర్శకుడు కమర్షియల్ అంశాల కంటే కథ, పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది.

టెక్నికల్ విభాగం

ఈ సినిమాకు అతిపెద్ద బలం విజువల్స్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా మార్చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మంచి బలం ఇచ్చింది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ పీరియడ్ ఫీల్‌ను అద్భుతంగా తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండి ఉంటే రన్‌టైమ్ మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్ అద్భుతమైన నటన
వెంకటేష్ మహా ప్రత్యేకమైన కథనం
అద్భుతమైన సినిమాటోగ్రఫీ
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
విజువల్ ప్రెజెంటేషన్

మైనస్ పాయింట్స్

మొదటి భాగంలో నెమ్మదిగా సాగే కథనం
కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం
మాస్ ప్రేక్షకులకు అన్ని చోట్ల కనెక్ట్ కాకపోవచ్చు
కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది

చివరగా

‘రావు బహదూర్’ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది విజువల్‌గా, భావోద్వేగాల పరంగా ఒక ప్రత్యేక అనుభూతిని అందించే ప్రయత్నం చేసిన సినిమా. సత్యదేవ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు వెంకటేష్ మహా తన ప్రత్యేకమైన స్టైల్‌ను మరోసారి నిరూపించాడు.మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే ప్రేక్షకులకు సినిమా కొంత నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ మంచి కథ, బలమైన నటన, అద్భుతమైన విజువల్స్‌ను ఆస్వాదించే వారికి మాత్రం ‘రావు బహదూర్’ తప్పకుండా నచ్చే సినిమా.

రేటింగ్        : 2.5/5

ఫైనల్ వెర్డిక్ట్:

డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన విజువల్ పీరియడ్ డ్రామా.

 

Continue reading
శ్రీనివాస మంగాపురం వాయిదా వేశారుగా

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది. జయకృష్ణ ఫస్ట్ మూవీ కావడంతో పాటు ఇలాంటి నెపోకిడ్స్ ను ఫస్ట్ టైమ్ పరిచయం చేసిన నిర్మాత ప్రెజెంటర్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. అదీ కాక ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోస్ అన్నీ బాగా పేలాయి. దీంతో ఈ మూవీ గ్యారెంటీగా విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు.
మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా ఇది ఉండబోతోందని మొదటే చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఏకంగా 1కోటి రూపాయలు ఇచ్చారు అనే ప్రచారం కూడా సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ కూడా ఉండటంతో శ్రీనివాస మంగాపురంను వాయిదా వేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అనేలా తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ అంటే ఇదే నెల 30న ఉండబోతోంది. అదీ కాక అదే రోజు మహేష్ బాబు హీరోగా ఫస్ట్ మూవీ రాజకుమారుడు విడుదలైన రోజు కూడా అదే. దీంతో ఇది కూడా కలిసొస్తుందని భావించారేమో.. ఈ నెల 30 శ్రీనివాస మంగాపురం విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.

Continue reading
కోలీవుడ్ లో దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్

సౌత్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తమ నాలుగో తమిళ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ధృవ్ విక్రమ్ ఫ్యాన్స్ కు మంచి జోష్ వస్తోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న ధృవ్‌కు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ మద్దతు లభించడం విశేషంగా మారింది.
ఈ చిత్రానికి యువ దర్శకుడు గణేష్ కె. బాబు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోందని టాక్.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్, త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, షూటింగ్ షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఇటీవల తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల నిర్మాణంపైనా మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.ఇప్పటికే తమిళ స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ధృవ్ విక్రమ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ద్వారా తమిళ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.
ధృవ్ విక్రమ్‌కు కూడా ఈ సినిమా కెరీర్‌లో కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. సరైన కథ, బలమైన నిర్మాణ విలువలు, ప్రముఖ బ్యానర్ కలిస్తే యువ హీరోకు ఇది పెద్ద బ్రేక్ ఇవ్వొచ్చనుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సినిమా టైటిల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read More

Continue reading
విజయ్ ‘జన నాయగన్’ జూలైలో విడుదల ఉంటుందా?

దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న ‘జన నాయగన్’ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా సినిమా మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. అయితే సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందట. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న కొన్ని సన్నివేశాలపై హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే మూవీ టీమ్ అవసరమైన మార్పులు చేయడానికి అంగీకరించిందని, అనంతరం సెన్సార్ ప్రక్రియ ముందుకు సాగినట్లు సమాచారం.
ఇక విడుదల విషయానికి వస్తే, ప్రస్తుతం సినిమా జూలైలోనే విడుదల చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్ బుకింగ్స్, డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ వంటి పనులు కూడా కొనసాగుతున్నాయని సమాచారం. అయితే అధికారిక రిలీజ్ డేట్‌ను చిత్రబృందమే ప్రకటించాల్సి ఉంది.

‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఉండటానికి మరో ప్రధాన కారణం ఇది దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడమే. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన ఈ చిత్రం కావడంతో అభిమానులు దీనిని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన సిఎమ్ అయ్యాడు.దీంతో జన నాయగన్ కు అన్నీ క్లియరెన్స్ లు వస్తాయని చాలామంది భావించారు. బట్ అలాంటిదేం జరగడం లేదు.అందుకే మూవీ రిలీజ్ డేట్ పై ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతానికైతే సెన్సార్ నుంచి అన్నీ క్లియరెన్స్ లు వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ లో సెన్సార్ ప్రాబ్లమ్ క్లియర్ కావడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు. కాకపోతే హిందీ సెన్సార్ నుంచి క్లియరెన్స్ లు రావాల్సి ఉంది. ఇక మిగతా భాషల్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం లేదు. అందుకే జన నాయగన్ ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు విడుదల కావడం ఖాయం అని చెబుతున్నారు.

Continue reading