Gaaradi Telugu news logo

అనుమాన పక్షి ట్రైలర్ రివ్యూ: తొలి అభిప్రాయం

అనుమాన పక్షి ట్రైలర్ రివ్యూ: ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కామెడీపై అంచనాలు పెంచిందా? మా అభిప్రాయంలో ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అనుమానం చుట్టూ నడిచే కథను పరిచయం చేసినా, ట్రైలర్‌లోని సన్నివేశాలు, డైలాగ్స్‌లో కొత్తదనం కనిపించలేదు.

కామెడీ సన్నివేశాలు ఎందుకు ఆకట్టుకోలేదు?

అనుమాన పక్షి మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే కంటెంట్ ఉంది. బట్ ఈ కంటెంట్ లో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఆ మాటకొస్తే ఇదో కామెడీ సినిమాలాగా బిల్డప్ ఇచ్చారు కానీ.. ఒక్కటంటే ఒక్క షాట్ లో కూడా నవ్వు రాలేదు. ఇంకా చెబితే కొన్ని సీన్స్ లో గిల్లుకున్నా నవ్వు రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు. కానీ మూవీలో బిల్డప్స్ మాత్రం చాలానే ఉన్నట్టుగా ఉన్నాయి. అజయ్, బ్రహ్మాజీ, రాశి వంటి వారితో డిఫరెంట్ రోల్స్ చేయించారు అనే ఫీలింగ్ ఉంది కానీ ఆ డిఫరెన్స్ మూవీ ట్రైలర్ లో ఇసుమంత కూడా కనిపించడం లేదు.

రాగ్ మయూర్ పాత్రలో కొత్తదనం ఉందా?

రాగ్ మయూర్ పాత్రను పరిచయం చేయడంలో కూడా ఏ మాత్రం కొత్తదనం లేదు. టైటిల్ లోనే అది ఉంది కదా. అక్కడి నుంచి మొత్తం టీమ్ కశ్మీర్ కు వెళ్లినట్టుగానూ అక్కడ వీరంతా కలిసి ఏదో చేస్తున్నట్టుగా కనిపించడం.. ఆ క్రమంలో వచ్చే ట్రైలర్ లోనే ఉన్న డైలాగ్స్ విసుగుపుట్టించేలా ఉండటం విశేషం. ఏదో కొత్తదనం చూపించిన ప్రయత్నం బానే ఉంది. కానీ ఈ క్రమంలో కనీసం ట్రైలర్ లో అయినా మినిమం ఆకట్టుకునే కంటెంట్ ఉండాలి కదా. మరి ఈ మాత్రం దానికి మూవీ చూడాలని ఎవరికి మాత్రం ఎందుకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే.. ఈ ట్రైలర్ చూస్తే ఆ మూవీ థియేటర్ దరిదాపుల్లోకి కూడా రావాలని ఎవరికీ అనిపించదు. అది మాత్రం గ్యారెంటీ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి