Gaaradi Telugu news logo

అల్లు అర్జున్, లోకేష్ మూవీ అప్డేట్

అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని ఈ యేడాది జనవరిలోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఈ మూవీపై పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. దీంతో అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబోలో మూవీ ఆగిపోయింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు.. అల్లు అర్జున్ తో కాదు ఈ దర్శకుడు మహేష్ బాబుతో మూవీ చేయబోతున్నాడు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ కూడా బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతోన్న సినిమా అని టాక్స్ కూడా వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ లో తెలియని ఓ కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ అయింది. ఆ కన్ఫ్యూజన్స్ కి లేటెస్ట్ గా ఫుల్ స్టాప్ పెట్టింది టీమ్.

అల్లు అర్జున్ సీరియస్ గా ఫోకస్ పెట్టాడు

అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ మూవీ ఆగిపోలేదు. కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్స్ లో కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మూవీ ఇది. భారీ బడ్జెట్ తో పాటు అల్లు అర్జున్ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. అదీ కాక ఇప్పటి వరకు లోకేష్ చేసిన కథలకు చాలా భిన్నమైన కథతో ఇది రూపొందబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే అర్థమైంది. యస్.. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి డౌట్స్ మొత్తం క్లియర్ చేశారు. ఈ మూవీ ఈ యేడాదే ప్రారంభం కాబోతోందని తేల్చారు. ఈ మూవీ ఆగిపోయింది అనే రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు.

అల్లు అర్జున్, లోకేష్ మూవీ ఈ యేడాదే స్టార్ట్

ఈ ప్రకటనతో ఇదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోన్న మూవీ అని అర్థమైంది. రాజులు, రాజ్యాలు, యోధులు తరహా పాత్రలుగా ఉండబోతున్నాయి అనేలా ఉంది. అల్లు అర్జున్ 23వ సినిమాగా ఇది రూపొందబోతోంది. మిగతా కాస్టింగ్ గురించి ఇప్పుడేం చెప్పలేదు. బట్ ఈ యేడాదే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పారు. అంటే మరో రెండు నెలల్లోనే 2026 పూర్తవుతుంది. సో.. నవంబర్ లేదా డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనుకోవచ్చు.

అల్లు అర్జున్, అట్లీ మూవీ చివరిదశలో

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీ చేస్తున్నాడు. ఇది కూడా ఫిక్షనల్ కంటెంట్ గా ఉండబోతోంది. ఇలా వరుసగా తమిళ్ దర్శకులతో పనిచేయడం వెనక ఉన్న అల్లు అర్జున్ కాన్సెప్ట్ ఏంటీ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికే అతను కేరళంలో తిరుగులేని ఫ్యాన్ బేస్ తో ఉన్నాడు. ఈ సారి తమిళనాడుపై కన్నేశాడు అని కూడా అనుకుంటున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి