అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, రాజకీయ అంశాలను కలిపి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని సింబాలిక్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రేక్షకులు కథలో పురాణాల ప్రభావం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం అఖిల్ మేకోవర్. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయికల్లో ఆమె ఒకరు. ‘లెనిన్’లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. సరదాగా ఉండే, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని స్వయంగా భాగ్యశ్రీ తెలిపింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీకి ఈ సినిమా కూడా విజయం అందించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే అది పూర్తిగా కథ, ఆమె పాత్ర నిడివి, ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మాత్రం అఖిల్-భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది ఇద్దరి ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. విడుదలకు ముందు సినిమాకు అదనపు హైప్ రావడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ప్రమోషన్స్ ను బట్టి చూస్తే ‘లెనిన్’లో యాక్షన్, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే సినిమా నిజంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ మాత్రం అఖిల్‌కు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకమైన సినిమా. కథ ప్రేక్షకులను మెప్పిస్తే ఇద్దరికీ ఇది పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది.

Continue reading
ఎవర్ గ్రీన్ క్లాసిక్ గీతాంజలి రీ రిలీజ్ కాబోతోంది

క్లాసిక్స్ అనే మాట అత్యంత అరుదుగా వినిపిస్తుంది. ఆ మాటలోనే ఆ మూవీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థమైపోతుంది. కథలో కొత్తదనం, కథనంలో నవ్యత వల్ల అప్పటి వరకు చూసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే మూవీస్ గా ఇవి కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్లాసిక్ మూవీనే గీతాంజలి. నాగార్జున, గిరిజ జంటగా నటించిన మూవీ ఇది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైన తెలుగు సినిమా కూడా ఇదే. మణిరత్నం మ్యాజిక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీతో ప్రేమలో పడిపోయారు. ఆ రోజుల్లో ఈ తరహా మూవీని ఎవరూ ఊహించను కూడా లేరు. 1989 మే 12న విడుదలైన గీతాంజలి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సినిమా ప్రారంభంలోనే కాలేజ్ లో హ్యాపీగా సాగుతున్న ప్రకాష్ కి అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. పైగా అది చివరి దశలో ఉందని డాక్టర్స్ చెబుతారు. దీంతో ఆ కొన్నాళ్లు తను తనకు నచ్చినట్టుగానే ఉండాలని ఊటీ వెళతాడు. అక్కడ ఓ అల్లరి అమ్మాయి గీతాంజలితో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య పోట్లాటల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. అదే టైమ్ లో గీతాంజలికి కూడా క్యాన్సర్ ఉందని.. అది కూడా చివరి దశలో ఉందని తెలుస్తుంది. మరి ఆ తర్వాత వీరి ప్రేమ ఏ తీరాలకు వీరిని తీసుకువెళుతుంది. చనిపోతారా లేక బ్రతికి ఉంటారా అనేది అత్యంత హృద్యంగా సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ మూవీ. కావడానికి ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్సే అయినా ప్రతి నిమిషం వీళ్లు సంతోషంగా బ్రతికి ఉంటారు. అదే ఈ మూవీలో కనిపించే కోర్ పాయింట్. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు అసలు వారికి వ్యాధి ఉందా లేదా అనేది కూడా లేని ఆనందంగా సాగుతుందీ కథనం. ఏదేమైనా ఈ మూవీ ఇప్పుడు మళ్లీ విడుదల చేయబోతున్నారు అంటే నాటి ప్రేక్షకులకు మళ్లీ చూడాలన్న తపన పెరుగుతూ ఉంటుంది.
ఇక గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 28న నాగార్జున బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇళయరాజా సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతం. టెక్నికల్ గా కంటెంట్ పరంగా హండ్రెడ్ మార్క్స్ పడిన ఈ మూవీ ఈ జెనరేషన్ ఆడియన్స్ కు కూడా చాలా చాలా బాగా నచ్చుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading